అవినీతిని ఉపేక్షించేది లేదు: కలెక్టర్

అవినీతిని ఉపేక్షించేది లేదు: కలెక్టర్

MDK: జిల్లాలో ఎవరైనా అధికారులు, వాళ్ల సిబ్బంది అవినీతి మరకలను అంటించుకుంటే సహించేది లేదని, అధికారులకు అవినీతి ఆలోచన ఉంటే విరమింప చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. మెదక్ కలెక్టరేట్‌లో అధికారులతో  ఆయన ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి డబ్బులు తీసుకోవడం చాలా ప్రమాదం అన్నారు. అవినీతి అనేది అతిపెద్ద నేరమన్నారు.