'సచివాలయ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి'

'సచివాలయ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి'

ప్రకాశం: సచివాలయ సిబ్బంది బాధ్యతగా పని చేసి ప్రజల మన్ననలు పొందాలని కనిగిరి మున్సిపల్ కమీషనర్ పి.కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఇందిరాకాలనీ, శంఖవరం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమీషనర్ మాట్లాడుతూ.. సచివాలయానికి వచ్చే ప్రజలతో వినయంగా మెలగాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలన్నారు.