పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు

కోనసీమ: భీమాభాయి మహిళా మండలి ఆధ్వర్యంలో రామచంద్రపురం రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం కొర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. విద్యార్థులకు వారి హక్కులు, విధులు గురించి వివరించారు. విద్యార్థులందరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.