నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
GNTR: విద్యుత్ మరమ్మతుల పనుల కారణంగా తుళ్లూరు మండలంలోని 33/11 కె.వి మందడం సబ్ స్టేషన్ పరిధిలో మందడం, వెంకటపాలెం, తాళ్ళాయపాలెం గ్రామాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.