VIDEO: గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ములుగు జిల్లా మచ్చాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారిపై ఇవాళ రోజున తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న 5 గొర్రెలను ఢీకొంది. దీంతో గొర్రెలు అక్కడికక్కడే మృత్యు వాత పడ్డాయి. బస్సు హన్మకొండ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా తెల్లవారుజామున భారీగా పొగ మంచు ఉండడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు.