భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
NRPT: దామరగిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠలాపూర్ గ్రామ శివారులో పాడుబడిన ఇంట్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఈ రోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. CI శివశంకర్ ఆధ్వర్యంలో SI రాజు బృందం దాడులు నిర్వహించగా, 510 బస్తాలు (238 క్వింటాళ్లు) బియ్యం, ఒక DCM వాహనం పట్టుకున్నారు. ఈ బియ్యం దౌల్తాబాద్ మండలానికి చెందిన వెంకటేష్‌కు సంబంధించినదిగా గుర్తించారు.