ఎంపీలకు బీజేపీ ఆర్డర్స్.. కీలక బిల్లులు వస్తున్నాయా?

ఎంపీలకు బీజేపీ ఆర్డర్స్.. కీలక బిల్లులు వస్తున్నాయా?

పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. ఈనెల 15 నుంచి 19 వరకు ఉభయసభల్లో సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ సమయంలో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉండటంతో ఎవరూ డుమ్మా కొట్టొద్దని హైకమాండ్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.