రేపు మంథని నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సు

PDPL: ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు మంథని ఆర్టీసీ డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ ప్రకటించారు. ఈనెల రేపు ఉదయం 6 గంటలకు మంథని నుంచి బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సు యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, కొలనుపాక, కొమురవెల్లి ఆలయ దర్శనాల తరువాత అదే రోజు రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకుంటుంది. ఛార్జీలు పెద్దలకు రూ. 1200, పిల్లలకు రూ. 800గా నిర్ణయించారు.