స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు పరిశీలన

NRML: నిర్మల్‌లోని బైల్ బజార్ చౌరస్తా నుంచి వెంగ్వాపేట వరకు వెళ్తున్న ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై బ్రేకర్ల ఏర్పాటుకు ఆర్అండ్బీ ఏఈ ఆంజనేయులు ఆదివారం పరిశీలన చేశారు. రెండేళ్లుగా రోడ్డు నిర్మాణం జరిగినప్పటికీ బ్రేకర్లు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఏఐఎంఐఎం నాయకుడు మహమ్మద్ ఇర్ఫాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.