దొరికిన సొమ్మును బాధితునికి ఇచ్చిన పోలీసులు

దొరికిన సొమ్మును బాధితునికి ఇచ్చిన పోలీసులు

ఏలూరు: త్రీ టౌన్ పోలీసులు నిజాయితీని చాటుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన ఉదయ్ శర్మ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తన పర్సును సోమవారం పోగొట్టుకున్నాడు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది గస్తీలో ఉండగా లభ్యమయింది. అందులో రూ. 8,700 నగదు, ఏటీఎం, ఆధార్ కార్డు ఉన్నాయి. వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఉదయ్ శర్మకు సమాచారం అందజేసి వాటిని అప్పగించారు.