'ప్రజలను మోసగించిన కూటమి ప్రభుత్వం'

'ప్రజలను మోసగించిన కూటమి ప్రభుత్వం'

VZM: వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు సోమవారం గజపతినగరం మండలంలోని భూదేవిపేట గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జడ్పీటీసీ గార తౌడు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించిందని అన్నారు. ఇందులో వైసీపీ నేతలు బెల్లాన త్రినాధరావు, బూడి వెంకటరావు, కనకల సుబ్రమణ్యం, పైడిపునాయుడులు పాల్గొన్నారు.