ఇంటివద్దకే వైద్యం వాహనాల ప్రారంభం

NLR: రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సోమవారం నెల్లూరులో 'నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్' - ఇంటివద్దకే వైద్యం అందించే వాహనాలను ప్రారంభించారు. జెండా వీధి షాదీ మంజిల్ వద్ద మొబైల్ వైద్య శిబిరాన్ని నారాయణ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు వర్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.