చీరల పంపిణీ పై ఓటర్ల వినూత్న నిరసన
NGKL: వంగూరు మండలం కోనాపూర్ లో ఓ పార్టీ అభ్యర్థి ఓటర్లకు చీరలు పంపిణీ చేశాడు. చీరలు తీసుకున్న కొంతమంది మహిళలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వాటిని విద్యుత్ స్తంభాలకు కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. ఓట్ల కోసం ప్రలోభాలకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ చీరల పంపిణీ గ్రామంలో రాజకీయ రగడకు దారితీసింది.