రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు
MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు సరఫరా చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సన్నకారు రైతులకు ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు సరఫరా చేస్తుందని తెలిపారు.