టీడీపీ నేత దాడి.. అవమానంతో సూసైడ్
నెల్లూరు: దగదర్తి(M) తడకలూరులో దారుణం చోటుచేసుకుంది. బెల్ట్ షాపుకు కల్లు పాక అడ్డు ఉందని టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు పేరం సతీష్ కల్లుపాక యజమాని హజరత్తయ్యపై దాడి చేశాడు. లక్షలు పోసి దక్కించుకున్న బెల్ట్ షాపుకు నష్టం కలిగిస్తారా అంటూ అతడిపై దాడి చేశాడు. దీంతో అవమానంతో హజరత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.