విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం
SRD: విదేశాల్లో చదువుకోవాలనుకునే ఎస్సీ విద్యార్థులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యానిధికి దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సోమవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు www.telanganaepass.cgg.gov.in చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.