'పది' పరీక్షల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
ప్రకాశం: 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు.16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని డీఈవో తెలిపారు.