రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

NRPT: మక్తల్ క్రీడాకారులు రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. విశ్రాంతి గోపాలం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 24 వరకు మహబూబాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు లభిస్తాయని గోపాలం వారికి సూచించారు.