గంజాయి సాగు చేస్తే చట్ట రీత్యా చర్యలు: SI

గంజాయి సాగు చేస్తే చట్ట రీత్యా చర్యలు: SI

ADB: గంజాయి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై రాధిక అన్నారు. తలమడుగు మండలంలోని న్యూ నందిగామ గ్రామ శివారులో గల కనక ఇస్రో తన వ్యవసాయ పొలంలో గాంజా పండిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఆ పొలంలో దాడులు నిర్వహించగా 320 గంజాయి చెట్లు పట్టు బడినట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని కేసును నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.