'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'

WGL: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.