‘3 రోజెస్ సీజన్ 2’ ట్రైలర్ విడుదల
‘3 రోజెస్' సీజన్ 2 వెబ్ సిరీస్ రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో ఇషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించారు. కమెడియన్ వైవా హర్షతో పాటు నటుడు సత్య కూడా కీలక పాత్రలు పోషించారు. ఎస్.కె.ఎన్ నిర్మాణంలో, కిరణ్ కారవల్ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.