అడవికి నిప్పు పెడితే పర్యావరణానికి ముప్పు

అడవికి నిప్పు పెడితే పర్యావరణానికి ముప్పు

ASR: వేసవిలో అడవుల్లో కార్చిచ్చు మానవ మనుగడకే ముప్పని తాజంగి ఎఫ్‌ఎస్‌వో ఎరుకులమ్మ హెచ్చరించారు. డీఎఫ్‌వో వై.వి. నరసింహారావు ఆదేశాల మేరకు చింతపల్లి మండలం తాజంగి సంతలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోడు సాగు, వేట కోసం నిప్పు పెడితే అటవీ సంపద, వన్యప్రాణులు నాశనం అవుతాయని తెలిపారు. అడవులు తగ్గితే వర్షాభావం, నీటి కొరత పెరుగుతాయని పేర్కొన్నారు.