ఘనంగా ఆంజనేయ స్వామి జల్దిబంద సేవ

ఘనంగా ఆంజనేయ స్వామి జల్దిబంద సేవ

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి జల్లిబింద సేవను శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలను చేసిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తిశ్రద్ధలతో జల్దీ బిందెసేవాను వైభవంగా నిర్వహించారు.