వేసవి వేళ తాగునీటిపై ప్రత్యేక నజర్
NLG: వేసవి దృష్ట్యా ఐటిపాములలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ బెల్లి సుధాకర్ తెలిపారు. బుధవారం నీటి సరఫరా వ్యవస్థను ఆయన స్వయంగా పర్య వేక్షించారు. గ్రామంలో ఎక్కడా నీటి ఎద్దడి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.