పంచాయతీ ఎన్నికలకు సిద్ధం!

NLG: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పనులు వేగవంతం అయ్యాయి. ఓటర్ల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు, MPDOలకు ఆదేశాలు జారీ చేశారు.