ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఉచిత ఇసుక : కలెక్టర్

WNP: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మే 5వ తేదీ లోపు లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు జిల్లాలో ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. ఎల్ఆర్ఎస్ నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.