VIDEO: జగన్మోహిని ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయంలో సోమవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మేళ తాళాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని యువత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.