ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో “రైతు సంబరం” ర్యాలీ

కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో మంగళవారం సాయంత్రం ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో “రైతు సంబరం” ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. “సూపర్ సిక్స్‌లో భాగంగా సకాలంలో ‘అన్నదాత సుఖీభవ’ అందించిన కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది” అన్నారు. సీనియర్ నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.