నూతన సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల పట్టణంలోని రైల్వే గేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జడ్చర్ల పట్టణంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామి ఇచ్చారు. పట్టణాన్ని అద్భుత రీతిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.