లోక్ అదాలత్‌కు భారీ స్పందన: CP
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 15న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన లభించింది. మొత్తం 5,025 కేసులను సత్వరం పరిష్కరించినట్లు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సైబర్ నేరాల కేసుల్లో రూ.89 లక్షల 20 వేలకుపైగా మోసపోయిన మొత్తాన్ని బాధితుల ఖాతాలకు తిరిగి జమ చేయాలని కోర్టు ఆదేశించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.