పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు శివారు పొలాల్లో పేకాట స్థావరంపై సోమవారం చేబ్రోలు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 22,900 నగదును స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.