అన్నదానం నిర్వహించిన చిరంజీవి అభిమానులు

VZM: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్దానిక ఉల్లివీధి, ఫైర్ ఆఫీస్ ఎదురుగా పట్టణ నిరాశ్రయుల వసతిగృహంలో అంజనీపుత్ర చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడా రామకృష్ణ ఆద్వర్యంలో అన్నదాన సమారాధన నిర్వహించారు. చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా రోజుకొక సేవాకార్యక్రమాలతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు.