కోడిపందాలపై దాడులు.. 15 బైకులు స్వాధీనం

కోడిపందాలపై దాడులు.. 15 బైకులు స్వాధీనం

ELR: దెందులూరు మండలంగోపన్నపాలెం పంచాయతీ కొత్తపల్లి శివారులో ఆదివారం రాత్రి జరుగుతున్న కోడి పందేలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఎస్సై శివాజీ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకులు ద్విచక్ర వాహనాలు వదిలేసి పారిపోయారు. 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పాల్గొన్న వారి వివరాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.