రైలు ఢీకొని వ్యక్తి మృతి
బాపట్ల సమీపంలో రైలు పట్టాల వద్ద ఇవాళ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని ట్రైన్ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.