అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
MBNR: రాంచంద్రాపూర్‌లో మానవత్వం పరిమళించింది. అర్ధరాత్రి పురిటినొప్పులతో బాధపడుతున్న జ్యోతి అనే మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది శ్రీనివాస్ నాయక్, సలీం సమయస్ఫూర్తితో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. జ్యోతి పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా, ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.