సంక్షేమ హాస్టల్ వార్డెన్లతో కలెక్టర్ సమావేశం

సంక్షేమ హాస్టల్ వార్డెన్లతో కలెక్టర్ సమావేశం

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కలెక్టరేట్‌లో హాస్టల్ వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలన్నారు. భోజనం, స్టడీ అవర్స్ సమయంలో వార్డెన్లు తప్పనిసరిగా హాజరై ఉండాలని, హాస్టళ్లలోనే నివసించాలని స్పష్టం చేశారు. కేటాయించిన బడ్జెట్‌ను నెలాఖరు లోపు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.