అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి

KMM: సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భూక్య కళ్యాణి(22) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. పెనుబల్లి మండలం బ్రహ్మలకుంటకు చెందిన కళ్యాణి సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ మసీదు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందగా స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.