'యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి'
VZM: బెట్టింగులకు యువత దూరంగా ఉండాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి పట్టణంలో శనివారం ఆయన బెట్టింగులు, సైబర్ నేరాలు, డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. బెట్టింగ్‌కు పాల్పడి అప్పులపాలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ మేరకు యువకుల ఫోన్లను చెక్ చేశారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.