కనిగిరిలో ఆవులకు లంపి స్కిన్ వ్యాధి
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఆవులకు లంపి స్కిన్ వ్యాధి సోకి అల్లాడుతున్నాయి. ఒంటినిండా బొబ్బలతో కూడిన పుండ్లు పడి ఇబ్బంది పడుతున్నాయి. రోడ్ల వెంబడి ఇటువంటి ఆవులు తిరగడం వలన ఇతర ఆవులకు, మనుషులకు ఈ వైరస్ సోకుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యజమానులు వ్యాధి సోకిన ఆవులకు వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.