మహిళ హత్య కేసులో ముద్దాయికి జీవితఖైదు
KRNL: గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన దేవదాసుకు బైలుప్పలకు చెందిన లక్ష్మిని హత్య చేసిన కేసులో సోమవారం ఆదోని కోర్టు జీవిత ఖైదు విధించింది. 2021లో మహిళ కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముద్దాయిని అరెస్ట్ చేసి విచారించారు. కసాపురం సమీప అటవీ ప్రాంతంలో హత్య చేసి శవాన్ని కాల్చినట్లు వెల్లడైంది.