కొండెక్కిన చికెన్ ధరలు.. కొనలేమన్న సామాన్యులు

కొండెక్కిన చికెన్ ధరలు.. కొనలేమన్న సామాన్యులు

NRML: జిల్లాలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. డ్రస్డ్ చికెన్ రూ.307, స్కిన్ లెస్ చికెన్ రూ.350 వరకు పలుకుతోంది. అయితే, వేసవి కాలం ప్రారంభం కావడం, శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎండాకాలం కావడంతో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేక చికెన్ ధరలు పెరిగాయి.