ఘనంగా పౌర్ణమి తిథి వేడుకలు

ఘనంగా పౌర్ణమి తిథి వేడుకలు

నెల్లూరు: రూరల్ మండల పరిధిలోని నరసింహకొండలో సోమవారం పౌర్ణమి తిధి వేడుకలు వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఘనంగా జరిగాయి. కొండపై వెలసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఉత్సవ మూర్తులకు అభిషేకం, సాయంత్రం గరుడసేవ గిరి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించిన్నట్లు ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు తెలిపారు.