'హిట్ 3' హిట్.. ట్రెండింగ్‌లో విశ్వక్ సేన్

నేచురల్ స్టార్ నాని నటించిన 'హిట్ 3' మూవీ సూపర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 'హిట్ 1' హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో నాని కంటే విశ్వక్ నటన బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్‌ను ట్యాగ్ చేస్తున్నారు. 'హిట్ 3'లో డ్రామా కంటే వైలెన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు.