'చట్టాలపై అవగాహన పెంచుకోండి'

E.G: విద్యతోపాటు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవడం అవసరమని ప్రిన్సిపల్ Jr. సివిల్ జడ్జి ఎన్. రెడ్డి ప్రసన్న అన్నారు. రాజానగరం దివాన్ చెరువులోని ZP ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, పోక్సో యాక్ట్, ఈవ్ టీజింగ్ వంటి చట్టాల గురించి వివరించారు. పోలీసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.