ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్
SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్‌తో కలిసి పరిశీలించారు. ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించి మరింత వేగవంతం చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా నాణ్యతతో చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.