రేపటి నుంచి 'ధనుర్మాసం' ప్రారంభం!
పరమ పవిత్రమైన ధనుర్మాసం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ మాసం విష్ణువుకు ప్రీతికరమైనది. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలి. తిరుమలలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ప్రత్యేకత ఉంది. వీటిని ఆచరించిన వారికి శుభం కలుగుతుంది. గురు, శుక్రవారం మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.