దీపిక విజ్ఞప్తికి వెంటనే రోడ్ల మంజూరు
సత్యసాయి: జిల్లా యువతి, భారత అంధ మహిళల టీ20 కెప్టెన్ దీపిక కోరిన రోడ్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే మంజూరు చేశారు. శుక్రవారం మంగళగిరిలో జరిగిన సమావేశంలో తంబలహెట్టికి రహదారి అవసరాన్ని ఆమె వివరించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రూ.6.2 కోట్ల అంచనాలతో రోడ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాలనా అనుమతులు జారీ చేశారు.