BIG BREAKING: తెలంగాణలో భూకంపం

TG: తెలంగాణలో భూకంపం సంభవించింది. కరీంనగర్, సుల్తానాబాద్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, ఖానాపూర్‌లో భూమి స్వల్పంగా కంపించింది. సరిగ్గా 6 గంటల 45 నిమిషాలకు 5 సెకన్ల పాటు భూకంపం వచ్చింది. ఈ క్రమంలో ఇళ్లలో నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.