'వాంఖడేలో సెమీస్.. IND-ENGకు పరీక్షే'

'వాంఖడేలో సెమీస్.. IND-ENGకు పరీక్షే'

వాంఖడే వేదికగా రేపు జరిగే సెమీస్ భారత్, ఇంగ్లండ్‌కు పరీక్షేనని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఇరుజట్లకు పిచ్ ఒకేలా సహకరిస్తుందని, ఆ రోజున జట్టుగా రాణించినవారిదే విజయమని పేర్కొన్నాడు. వాంఖడేలో భారత్ ఆడిన 7 మ్యాచుల్లో 5 గెలిచింది. అటు ఇంగ్లండ్ ఇక్కడ భారత్‌తోనే 2 ఆడి ఒకటి గెలిచింది. ఆ గెలిచినదే వాంఖడే ఆతిథ్యమిచ్చిన తొలి T20(2012లో) కావడం విశేషం.