VIDEO: బేతంచెర్లలో మల్లికార్జునస్వామి గ్రామోత్సవం
NDL: బేతంచెర్ల మండల పరిధిలోని బలపాలపల్లిలో వెలసిన బీరప్ప మల్లికార్జునస్వామి గ్రామోత్సవం శనివారం తెల్లవారుజామున వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తజన సందోహం నడుమ స్వామివారిని ప్రత్యేక పుష్పాలంకరణలో అలంకరించి గ్రామోత్సవం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.